Friday, August 26, 2011

jai Telangana

జై. తెలంగాణ .




నిజాం అరాచకాలకు అంతం పలికిన అద్వితీయ పోరు..
కత్తులు దూసిన కత్తులను తుత్తునియలు చేసిన్రు...
అరాచకాలను ఎదురొడ్డిన లోల్లి చేసిన్రు....
అణచివేతలపై భల్లున ఎగసిన్రు..
సిస్తుల జివోలను చిత్తుచేసిన్రు..
గుర్రపు డెక్కలతో నిజాం చేసిన కరతాల నృత్యాలను ఖతం చేసిన్రు..
రాజకార్ల .... రాంరాం చేసిన్రు..
అరాచాకలను అంతం చేసిన్రు.
మా భూమి మాదని నినాదించిన్రు..
మా పంటను మేమే కోసుకుంటమని సవాల్ చేసిన్రు..
దాడులకు పూనుకున్న నిజాం సైన్యంపై...
నిప్పుల వాన కురించిన్రు..
తెలంగాణ సాయుధ పోరుతో నిజాం తోక ముడిపించిన్రు..
అది తెలంగాణ సాయుధ పోరాటం..
ఆ పోరే నేటి ఉద్యమానికి ఊపిరి..
ఆ పోరే నేటి త్యాగాలను పూనాది...
ఆ పోరే నేటీ ఉద్యమకారుల నిస్వార్థ పోరుకు.. వారధి.
అందుకే నాడు.. తెల్లోల్లు
నిన్న రాజకార్లు...
నేడు ఆంద్రోళ్లు..
దుర్మార్ఘుల చెరలో పడి బంధీ అయిన తెలంగాణ పుణ్యభూమిని కాపాడుకుందాం..
పోరు చేసి అమరులైన వీరులను కంటికి రెప్పాల కాపాడుకుందాం..
మన తెలంగాణను మనం సాధించుకుందాం.
ఆనాటి నిజాం అరాచకాలను ప్రత్యక్ష సాక్ష్యమే పైన మీరు చూస్తున్న ఫోటో...
"పంప్పిన వారు రమణ శ్రీ పాద "